Kerala : వయనాడ్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన రాహుల్ గాంధీ తన ఆస్తుల విలువను ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. రూ. 20 కోట్లుగా చూపించారు. రూ.11.15 కోట్ల స్థిరాస్తులు, రూ.9.24 కోట్ల చరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. తన వద్ద రూ.55 వేల నగదు ఉన్నట్లు తెలిపారు. సొంత కారు, ఇల్లు కూడా లేవని వెల్లడించడం గమనార్హం. సోదరి ప్రియాంకా గాంధీతో కలిపి దిల్లీలో వ్యవసాయ భూమి ఉన్నట్లు తెలిపారు.