Homeఅంతర్జాతీయం#Trump #USA : ట్రంప్‌కు వ్యతిరేఖంగా సొంత పార్టీ నేతలు

#Trump #USA : ట్రంప్‌కు వ్యతిరేఖంగా సొంత పార్టీ నేతలు

Some Republicans, who are already masters of Trump’s stance, have announced that they will vote in support of the impeachment motion to remove him from the House of Representatives.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభిశంసన ఆయన సొంత పార్టీ రిపబ్లికన్‌లో చీలకలకు కారణమవుతోంది.

ట్రంప్‌ తీరుపై ఇప్పటికే గుర్రుగా ఉన్న కొంత మంది రిపబికన్లు.. ఆయనను తొలగించేందుకు ప్రతినిధుల సభలో ప్రవేశపెడుతున్న అభిశంసనకు మద్దతుగా ఓటేయనున్నట్లు ప్రకటించారు.

తొలుత రిపబ్లికన్‌ పార్టీలో మూడో అత్యంత శక్తిమంతమైన నేతగా పెరుగాంచిన లిజ్‌ చెనీ ట్రంప్‌పై అభిశంసనకు మద్దతు పలికారు.

అమెరికా చరిత్రలో అధ్యక్ష హోదాను ట్రంప్‌ దుర్వినియోగపరిచినంతగా మరెవరూ చేయలేదని ఆమె విమర్శించారు.

క్యాపిటల్‌ భవనంపై దాడి ట్రంప్‌ పిలుపు మేరకే జరిగిందని ఆరోపించారు. దాడి జరిగేసమయంలో ట్రంవ్‌ జోక్యం చేసుకొని నిలువరించాల్సిందని అభిప్రాయపడ్డారు.

మరో నేత ఆడమ్‌ కిన్‌జింగర్‌, జాన్‌కట్కో కూడా చెనీ బాటలోనే పయనించనున్నట్లు ప్రకటించారు.

మరికొంత మంది కూడా ట్రంప్‌నకు వ్యతిరేకంగాఓటు వేయనున్నట్లు అమెరికా మీడియా పేర్కొంది.

అదే పార్టీలోని మరో వర్షం ట్రంవ్‌ అభిశంసనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. చివరి రోజుల్లో ఈ ప్రక్రియపారంభించడం కేవలం రాజకీయ కుట్రేనని ఆరోపించింది.

దీనివల్ల అధికార బదిలీకి ఆటంకం కలిగే అవకాశంఉందని అభిప్రాయపడింది. అయితే, డెమొక్రాట్లు మాత్రం ట్రంవ్‌ తొలగించేందుకు సిద్ధమయ్యారు.

ఈ మేరకు నేడు ప్రతినిధుల సభలో అభిశంసనపై ఓటింగ్‌ జరగనుంది.

Recent

- Advertisment -spot_img