Homeహైదరాబాద్latest Newsడేంజర్‌లో ఓజోన్ వాయువు.. ఓజోన్‌ పొర దెబ్బతినడానికి మానవ తప్పిదమే కారణమా..?

డేంజర్‌లో ఓజోన్ వాయువు.. ఓజోన్‌ పొర దెబ్బతినడానికి మానవ తప్పిదమే కారణమా..?

ఓజోన్‌ అంటే సమస్త ప్రపంచాన్ని రక్షించే ఒక కవచం. భగభగమండే సూర్యుడి నుంచి అతి నీలలోహిత కిరణాలు భూమిపైకి వస్తాయి. అయితే ఈ కిరణాలు భూమిపై నేరుగా పడితే, సకల జీవరాశులు డేంజర్‌ జోన్‌లో పడ్డట్లే అనుకోవాలి. తరుముకువచ్చే ఈ ప్రమాదాన్ని అడ్డుకుంటోంది ఓజోన్‌ పొర. అంతిమంగా సూర్యుడి నుంచి భూగోళాన్ని ఓజోన్‌ పొర కాపాడుతోంది. కొంతకాలంగా ఓజోన్‌ పొర క్రమేపీ పలచబడుతోంది. దీనికి మానవ విధ్వంసమే ప్రధాన కారణమని సైంటిస్టులు చెబుతున్నారు.

ఓజోన్‌ పొర దెబ్బతినడానికి మానవ తప్పిదమేనా..!
ఓజోన్‌ పొర దెబ్బతినడమనేది నూటికి నూరు శాతం మానవ తప్పిదమే అంటున్నారు సైంటిస్టులు. ఓజోన్‌ విధ్వంసంలో క్లోరోఫ్లోరో కార్బన్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అయితే గతంలో ఓజోన్‌ పొరకు పడిన రంధ్రం ఇటీవల పూడుకుపోయింది. కరోనా సమయంలో ఏడాదికిపైగా ప్రపంచంలో అన్నిరకాల కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఎక్కడికక్కడ పారిశ్రామిక సంస్థలు బంద్‌ అయ్యాయి. ఎక్కడా కాలుష్యం అనే మాటే వినపడలేదు. దీంతో ఓజోన్‌ పొరకు పడిన రంధ్రం చాలా త్వరగా పూడుకుపోయిందని చెబుతున్నారు.

Recent

- Advertisment -spot_img