ఇదే నిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో భారీ వర్షం కారణంగా మండల వ్యవసాయ మార్కెట్లో తడిసిన వడ్లు. వ్యవసాయ మార్కెట్లో నీట మునిగిన వరి ధాన్యం విలవిల పోతున్న రైతన్నలు. వాతావరణ ప్రభావంతో రైతులకు కష్టాలు. రైతులు రాత్రినకా, పగలనకా కష్టపడి పండించిన వడ్లు చేతికి అందే సమయంలో వర్షం కారణంగా రైతులకు చేతికి అందకుండా వడ్లు తడవడం జరిగింది. తడిసిన వడ్ల కుప్పలను చూసి రైతులు బోరున ఆవేదన వ్యక్తం చేశారు.వర్షం కారణంగా రైతులకు తీవ్ర నష్టం.ప్రభుత్వం రైతన్నలను ఆదుకోవాలని కోరడం జరిగింది.