జమ్మూ కాశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడి వెనుక లష్కరే తోయిబా టాప్ కమాండర్ సైఫుల్లా సాజిద్ జట్ హస్తం ఉండొచ్చని సమాచారం అందుతోంది. పాక్ లోని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన సాజిదును సైఫుల్లా కసూరీగానూ పిలుస్తారు. NIA ఇతడిని తీవ్ర ఉగ్రవాదిగా పేర్కొంది. ప్రస్తుతం ఇస్లామాబాద్ నుంచి ఇతడు ఆపరేషన్స్ చేపడుతున్నట్లు తెలుస్తోంది. పాకిస్థానీ ISI, ఆర్మీతో ఇతడికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు సమాచారం.