Homeఅంతర్జాతీయంఎల్​వోసీ వద్ద కాల్పులకు పాల్పడ్డ పాక్​

ఎల్​వోసీ వద్ద కాల్పులకు పాల్పడ్డ పాక్​

జిత్తులమారి పాకిస్తాన్ మరోసారి తన కుక్క బుద్ది చూపింది. తాజాగా జమ్మూకాశ్మీర్‌లోని నౌగం, తంగ్ధర్ సెక్టార్లలోని నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వెంబడి కాల్పుల విరమణను ఉల్లంఘించడంతో ఆరుగురు భారతీయ పౌరులు గాయపడ్డారని ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు.
“మోర్టార్, ఇతర ఆయుధాలను ఉపయోగించి పాకిస్తాన్ నౌగాం, కుప్వారా (ఉత్తర కాశ్మీర్ జిల్లా) లోని తంగ్ధర్ సెక్టార్​లలోని నియంత్రణ రేఖ వెంట అప్రకటిత కాల్పుల విరమణ ఉల్లంఘన (సిఎఫ్వి) ను ప్రారంభించింది” అని అధికారి తెలిపారు.
తంగ్ధర్ సెక్టార్లో పాకిస్తాన్ కాల్పుల కారణంగా ఆరుగురు పౌరులు గాయపడ్డారని, నౌగం సెక్టార్ నుండి ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని ఆయన అన్నారు.
పాకిస్తాన్ దురాక్రమణకు భారత సైన్యం తగిన ప్రతిస్పందన ఇచ్చిందని ఆయన అన్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img