జమ్మూకశ్మీర్‌లోని చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెనపై పొరుగుదేశం పాకిస్థాన్ కన్నేసినట్లుగా ఇంటలిజెన్స్ వర్గాలు పేర్కొన్నట్లు పలు మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయి. జమ్మూకశ్మీర్‌లోని రైసీ, రామబాణ్ జిల్లాల మధ్య నిర్మిస్తున్న ఈ వంతెనకు సంబంధించిన వివరాలు సేకరించమని చైనా.. పాకిస్థాన్‌ను కోరడంతో ఆ దేశ ఇంటెలిజెన్స్ వర్గాలు ఈ బ్రిడ్జి గురించిన కీలకమైన విషయాలు తెలుసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.