ఇదే నిజం బొల్లారం : జిన్నారం మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చిత్రపటాలకు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పటాన్చెరువు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ మెదక్ పార్లమెంట్ కంటెస్టెడ్ కాండేట్ నీలం మధు ముదిరాజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా లో సీఎం రేవంత్ రెడ్డి దామోదర రాజనర్సింహ చిత్రపటాలకు పార్టీ శ్రేణులతో కలిసి నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణమాఫీ ప్రకటనపై హర్షం వ్యక్తం చేశారు. ఆరోగ్యారెంటీలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రవీందర్ గౌడ్ మండల పార్టీ అధ్యక్షుడు వడ్డే కృష్ణ నాయకులు శ్రీకాంత్ రెడ్డి రాజు గౌడ్ పల్నాటి భాస్కర్ నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.