Homeహైదరాబాద్latest Newsరేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం.. రుణమాఫీ పై హార్షం వ్యక్తం..

రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం.. రుణమాఫీ పై హార్షం వ్యక్తం..

దే నిజం – మెట్ పల్లి రూరల్: మెట్ పల్లి మండలంలోని వేం పెట్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నేతలు, రైతుల ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రైతుల రుణాల మాఫీ చేయడం దేశ చరిత్రలో గొప్పదని అన్నారు. రుణ మాపీ వల్ల రైతులందరికీ లాభం చేకూరిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నల ప్రభుత్వం అని, అదేవిధంగా రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం అని నినాదించారు. అనంతరం స్వీట్లు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ గురుమతుల ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు రాజారెడ్డి, కిషన్ సేల్ తుమ్మల లింగారెడ్డి, మరంపల్లి రాష్ట్రపతి, రాజారెడ్డి, నలిమెల అజయ్య, అచల్లు,నాయకులు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు జెట్టి లింగం, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img