ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన పలిగిరి రాజేందర్ తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ ధూంధాం ద్వారా ఉమ్మడి పది జిల్లాల వ్యాప్తంగా వందల ప్రదర్శనలు ఇచ్చి తన ఆట పాటలతో ప్రజలలో చైతన్యం రేకెత్తించిన ఉద్యమ గాయకుడు పలిగిరి రాజేందర్ కు “ఉద్యమ గాన కోకిల” అవార్డును ప్రధానం చేసిన ఉత్తర తెలంగాణ పీపుల్స్ మూమెంట్ సంస్థ.తెలంగాణ మలిదశ ఉద్యమంలో భాగంగా తెలంగాణ పది జిల్లాల వ్యాప్తంగా వందల వేదికలపై తన ఆట పాటలతో ప్రజలను చైతన్యపరిచి తెలంగాణ ఆవశ్యకతను తెలియజేశాడు. అందుకుగాను ఉత్తర తెలంగాణ పీపుల్స్ మూమెంట్ సంస్థ పలిగిరి రాజేందర్ కు ఈ అవార్డును అందచేశారు. ఈరోజు కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో ప్రముఖుల చేతుల మీదుగా ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రజా ప్రతినిధులు, కవులు,కళాకారులు పలిగిరి రాజేందర్ ను అభినందించారు.