Homeహైదరాబాద్latest NewsPamban Bridge: పంబన్‌ బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ.. ఈ బ్రిడ్జి గురించి ఆసక్తికర విషయాలు.....

Pamban Bridge: పంబన్‌ బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ.. ఈ బ్రిడ్జి గురించి ఆసక్తికర విషయాలు.. అలాగే ఈ బ్రిడ్జి మీదుగా వెళ్లే ఫస్ట్ రైలు, హాల్ట్ స్టేషన్లు ఇవే..!

Pamban Bridge: భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోనే తొలి వర్టికల్‌ లిఫ్ట్‌ రైల్వే సీ బ్రిడ్జ్‌ను రిమోట్‌ పద్ధతిలో ప్రారంభించి జాతికి అంకింతం చేశారు. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో రూ.535 కోట్లతో సముద్రంలో 2.08 కిలోమీటర్ల పొడవున దీన్ని నిర్మించారు. మార్చి 2019లో ఈ కొత్త పంబన్‌ బ్రిడ్జికి ప్రధాని నరేంద్ర మోదీ పునాదిరాయి వేశారు. నాలుగేళ్లలో రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ దీన్ని పూర్తి చేసింది. ఈ బ్రిడ్జి నిర్మాణంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించారు.

పంబన్‌ బ్రిడ్జి మీదుగా వెళ్లే ఫస్ట్ రైలు, హాల్ట్ స్టేషన్లు ఇవే!
పాంబన్ బ్రిడ్జిపై తాంబరం- రామేశ్వరం ఎక్స్‌ప్రెస్ మొదటిగా రాకపోకలు సాగించనుంది. ఈరోజు సాయంత్రం 6:10 నిమిషాలకు తాంబరం నుంచి బయలుదేరి, మరుసటి రోజు తెల్లవారు జామున 5:40 నిమిషాలకు రామేశ్వరం చేరుకుంటుంది. చెంగల్పట్టు, విల్లుపురం, తిరుప్పదిపులియూర్, చిదంబరం, మైలాడుథురై, తిరువారూర్, తిరుత్తురైపూండి, పట్టుకోట్టై, అరంథంగి, కారైకుడి, శివగంగ, మనమధురై, పరమక్కుడి, రామనాథపురం మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.

పంబన్‌ బ్రిడ్జి గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

  • పాంబన్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.535 కోట్లు ఖర్చయింది.
  • ఈ బ్రిడ్జిలోని వర్టికల్ లిఫ్టును ఒక్క బోల్టు కూడా వాడకుండా వెల్డింగ్‌తోనే నిర్మించారు.
  • బ్రిడ్జికి 99 పిల్లర్లు ఉన్నాయి. సముద్రం అడుగున గట్టి నేల తగిలే వరకు 25-35 మీ. లోతున పునాదులు వేశారు.
  • ఈ వంతెన వచ్చే 100 ఏళ్ల వరకు పటిష్ఠంగా ఉంటుందని ఇంజినీర్ల అంచనా.
  • గరిష్ఠంగా గంటకు 80 కి.మీ వేగంతో రైళ్లు వెళ్లొచ్చు.

Recent

- Advertisment -spot_img