Homeజిల్లా వార్తలు‘పోరు గర్జన’ కరపత్రం విడుదల

‘పోరు గర్జన’ కరపత్రం విడుదల

ఇదే నిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా ధర్మపురి సెగ్మెంట్​ పరిధిలో ఎమ్మార్పీఎస్​ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్​ ‘చలో హైదరాబాద్​ పోరు గర్జన’ పోస్టర్లను ఆవిష్కరించారు. పారిశుధ్య కార్మికులను పర్మినెంట్​ చేయాలి.. మంత్రి వర్గంలో మాదిగలకు సముచిత స్థానం కల్పించాలి వంటి కొన్ని డిమాండ్లతో ఎమ్మార్పీఎస్​ ఈ నెల 29న చలో హైదరాబాద్​ కార్యక్రమం తలపెట్టింది. ఇందుకు సంబంధించిన పోస్టర్లను ఆయన విడుదల చేశారు. ఈ కార్యక్రమం లో జగిత్యాల జిల్లా అధ్యక్షుడు గంగాధర నరేశ్​, రాష్ట్ర కార్యదర్శి లింగంపల్లి లక్ష్మణ్​, రాష్ట్ర నాయకులు చెవులమద్ది హన్మాండ్లు, జిల్లా నాయకులు గొల్లపల్లి నర్సయ్య, చిర్ర లక్ష్మను, వివిధ మండల అధ్యక్షులు ధర్మపురి మండల అధ్యక్షులు కలమడుగు అరుణ్, జగిత్యాల మండల అధ్యక్షుడు మేడపట్ల చంద్రయ్య, గొల్లపల్లి మండల అధ్యక్షులు చెవులమద్ది గౌతమ్, సీనియర్ నియోజకవర్గ నాయకులు నాయకులు చిపెల్లి పోచయ్య, చెవులమద్ది నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img