Panchayat Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. దాదాపు ఆరేళ్ల తర్వాత రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నందున ఎన్నికల నిర్వహణపై పకడ్బందీగా శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. స్టేట్ ఎలక్షన్ కమీషన్ (EC) కార్యాలయంలో మాస్టర్ ట్రైనర్లకు బుధవారం శిక్షణ నిర్వహించారు. వారు గురువారం హైదరాబాద్ లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణ సంస్థలో ట్రైనర్లకు శిక్షణ ఇస్తారు. వారు శుక్రవారం నుంచి జిల్లాలకు వెళ్లి ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇస్తారు.
ALSO READ : ఉచిత రేషన్.. అనర్హుల తొలగింపు.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!