Panchayat Elections: పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం ఏకాభిప్రాయానికి రాలేక తంటాలు పడుతున్నట్లు సమాచారం. డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎన్నికల నిర్వహణకు వెళ్లాలని నిర్ణయించింది. అయితే ఫిబ్రవరి 2లోపు డెడికేషన్ కమిషన్ రిపోర్టు రానుంది. మరోవైపు ఫిబ్రవరిలోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 2 తర్వాత మరోసారి పంచాయతీ ఎన్నికలపై సమావేశమై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.