భారత క్రికెటర్ హార్దిక్ పాండ్య.. సెర్బియా నటి నటాషా తమ వివాహ బంధానికి ముగింపు పలికిన విషయం తెలిసిందే. బ్రిటిష్ సింగర్ జాస్మిన్‌తో హార్దిక్ పాండ్య డేటింగ్‌లో ఉన్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. హార్దిక్ పాండ్య..జాస్మిన్ వాలియాలు ఒకే లొకేషన్‌లో దిగిన ఫోటోలను తమ తమ ఇన్‌స్టా ఖాతాల్లో పోస్ట్ చేశారు. దీంతో వీరిద్దరూ కలిసే వెకేషన్‌కు వెళ్లినట్లు ఊహాగానాలు మొదలయ్యాయి.
ఎవరీ జాస్మిన్ వాలియా..?
తాజాగా హార్దిక్, బ్రిటిష్ సింగర్ జాస్మిన్ వాలియాతో డేటింగ్‌లో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో జాస్మిన్ వాలియా బ్యాక్‌గ్రౌండ్ గురించి నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. ఇంగ్లాండ్‌లోని ఎసెక్స్ ప్రాంతానికి చెందిన జాస్మిన్ తొలుత టీవీ సిరీస్‌ల్లో నటించింది. 2014లో సొంతంగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించింది. ఆమె పాడిన ‘బామ్ డిగీ’ పాటను ఓ బాలీవుడ్ సినిమాలో రీమేక్ చేశారు. ఇన్‌స్టాలో ఆమెకు 6.4లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.