Homeహైదరాబాద్latest Newsతల్లిదండ్రులు తమ పిల్లలకు నచ్చిన రంగంలో ప్రోత్సహిస్తే అద్బుతాలు సృష్టిస్తారు: ఆరెకపూడి గాంధీ

తల్లిదండ్రులు తమ పిల్లలకు నచ్చిన రంగంలో ప్రోత్సహిస్తే అద్బుతాలు సృష్టిస్తారు: ఆరెకపూడి గాంధీ

ఇదేనిజం, శేరిలింగంపల్లి: తల్లిదండ్రులు తమ పిల్లలకు వారి నచ్చిన రంగంలో ప్రోత్సహిస్తే అద్బుతాలు సృష్టిస్తారని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు.కొండాపూర్ లోని శిల్పారామంలో జరిగిన నృత్య మాలిక సాంస్కృతిక కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రాంచందర్ తో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలకు వారి నచ్చిన రంగంలో ప్రోత్సహిస్తే అద్బుతాలు సృష్టిస్తారని, వారిలో దాగి ఉన్న కళ ను గుర్తించి దానికి తగ్గ సాధన చేయిస్తే వారు ఉన్నత శిఖరాలను అధిరోహించి ప్రఖ్యాతులు తీసుకువస్తారన్నారు. సాంస్కృతిక కళా నైపుణ్య ప్రదర్శనలు చేసిన పిల్లలను ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img