పారిస్ ఒలింపిక్స్ 2024 పతకాల పట్టికలో భారత్ 69వ స్థానంలో నిలిచింది. భారత్ ఇప్పటివరకు ఆరు పతకాలు గెలుచుకుంది. అందులో ఒక రజత పతకం, ఐదు కాంస్య పతకాలు ఉన్నాయి. మరోవైపు మొత్తం 111 పతకాలతో అమెరికా పతకాల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. అందులో 33 స్వర్ణ పతకాలు ఉన్నాయి. ఇక 83 పతకాలతో చైనా రెండో స్థానంలో ఉంది. 57 పతకాలతో గ్రేట్ బ్రిటన్ మూడో స్థానంలో, 56 పతకాలతో ఫ్రాన్స్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి.