ఒలింపిక్స్‌లో భారత మహిళా షూటర్ చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఆమె ఫైనల్‌కు అర్హత సాధించింది. ఆమె 631.5 స్కోరుతో స్టాండింగ్స్‌లో 5వ స్థానంలో నిలిచింది. గత 20 ఏళ్లలో మను భాకర్ తర్వాత ఫైనల్ రౌండ్‌కు చేరుకున్న రెండో మహిళా షూటర్‌గా రమిత నిలిచింది. అయితే పతకంపై ఆశలు రేపిన భారత్‌కు చెందిన మరో మహిళా షూటర్ ఎలవెనిల్ వలరివన్ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది.