పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండో పతకం లభించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ కాంస్య పోరులో భారత జోడీ మను బాకర్, సరబ్‌జ్యోత్ విజయం సాధించింది. దీంతో ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన క్రీడాకారిణిగా మనుబాకర్ రికార్డు సాధించింది.