పారిస్ ఒలింపిక్స్ పోటీల్లో భారత్ మరో పతకం సాధించింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ విభాగంలో భారత షూటర్ స్వప్నిల్ సత్తా చాటాడు. 451.4 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం గెలుచుకున్నాడు. దీంతో భారత్ ఖాతాలో మూడు పతకాలు చేరాయి. ఉక్రెయిన్‌కు చెందిన సెర్హి కులిష్ 461.3తో రజతం సాధించాడు. 463.6 పాయింట్లతో టాప్‌లో ఉన్న చైనీస్ యుకున్ లియు గోల్డ్ మెడల్ సాధించారు.