Homeహైదరాబాద్latest NewsParis Olympics: తొలి రోజు ఎయిర్‌ పిస్టల్‌లోనూ నిరాశే.. ఒక్క పాయింట్ తేడాతో..!

Paris Olympics: తొలి రోజు ఎయిర్‌ పిస్టల్‌లోనూ నిరాశే.. ఒక్క పాయింట్ తేడాతో..!

పారిస్ ఒలింపిక్స్‌లో తొలి రోజు భారత షూటర్లు తడబడ్డారు. షూటింగ్‌ 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ క్వాలిఫికేషన్‌ పురుషుల విభాగంలో సరబ్‌జోత్‌ సింగ్, అర్జున్‌ చీమా నిరాశపర్చారు.ఈ ఈవెంట్‌లో 33 మంది షూటర్లు పాల్గొన్నారు. అయితే టాప్‌-8లో చోటు దక్కకపోవడంతో ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. అర్జున్‌ చీమా 18వ స్థానానికి పరిమితమయ్యాడు. అంతకుముందు 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో ఎలవెనిల్‌ వలరివన్‌-సందీప్‌ సింగ్, రమిత-అర్జున్‌ బబుతా జోడీలు నిరాశపర్చాయి. అయితే భారత్‌కు చెందిన సరబ్‌జోత్ సింగ్ 577 పాయింట్లతో 9వ స్థానంలో నిలిచాడు. ఒక్క పాయింట్ తేడాతో ఫైనల్స్ కి చేరుకోలేకపోయాడు.

Recent

- Advertisment -spot_img