పారిస్‌లో ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు జరిగాయి. ప్రపంచంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ వేడుకకు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. ఈ నేపధ్యంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కుటుంబం కూడా పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలకు హాజరైంది. చిరంజీవి తన సతీమణి సురేఖ, కుమారుడు రామ్‌చరణ్, కోడలు ఉపాసన, మనవరాలు క్లీంకరతో కలిసి పారిస్‌లో సందడి చేశారు. రామ్‌చరణ్ సతీమణి ఉపాసన దీనికి సంబంధించిన ఫొటోలను అభిమానుల కోసం సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.