పారిస్ ఒలింపిక్స్ నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ప్రపంచ క్రీడల్లో 16 ఈవెంట్లలో భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు పోటీ పడుతున్నారు. గత ఒలింపిక్స్‌తో పోలిస్తే ఈసారి తక్కువ మంది మాత్రమే అర్హత సాధించారు.206 దేశాల నుంచి 10,500 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. అయితే అథ్లెట్లలో 11 ఏళ్ల చిన్నారి మరియు 61 ఏళ్ల బామ్మ ఉండడం విశేషం.
ఈసారి ఒలింపిక్స్‌లో సగం మంది మహిళలు, పురుషులు పాల్గొననున్నారు. ఒలింపిక్స్‌లో లింగ సమానత్వం ఉండటం చరిత్రలో ఇదే తొలిసారి. అయితే 1972 మ్యూనిచ్ ప్రపంచ క్రీడలకు ముందు, కనీసం 20 శాతం మంది మహిళలు కూడా పోటీ చేయలేదు.ఈసారి పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల మారథాన్‌తో క్రీడలు ముగియనుండడం మరో ప్రత్యేకత. సాధారణంగా పురుషుల మారథాన్‌తో ఒలింపిక్స్ ముగుస్తుందన్న సంగతి తెలిసిందే.