పారిస్ ఒలింపిక్స్-2024 ఆర్చరీ మిక్స్‌డ్ విభాగంలో భారత్ శుక్రవారం క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. ఎలిమినేషన్ రౌండ్‌లో ఇండోనేషియాపై 5-1 తేడాతో భారత్ గెలిచింది. భారత ఆర్చర్లు అంకిత భకత్, ధీరజ్ బొమ్మ దేవర 37-36, 38-38, 38-37 స్కోర్‌లైన్‌తో ఇండోనేషియాకు చెందిన డయానంద చోయిరునిసా – ఆరిఫ్ పాంగేస్తుపై విజయం సాధించారు. తద్వారా భారత మిక్స్‌డ్ ఆర్చరీ టీమ్ క్వార్టర్ ఫైనల్‌లో ప్రవేశించింది.