Park Hyatt : హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. హోటల్ మొదటి అంతస్తు నుంచి భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. హోటల్ నుంచి భారీగా పొగలు వస్తుండటంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. హోటల్ సిబ్బంది అందించిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపు చేసేందుకు శ్రమించారు.
అయితే అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు హోటల్ లోనే ఉన్నారు. 6వ అంతస్తులో ఉన్న సన్ రైజర్స్ ఆటగాళ్లు వెంటనే హోటల్ ను ఖాళీ చేసి వెళ్లిపోయారు. అగ్ని ప్రమాదానికి గల కారణం ఇంకా నిర్ధారించబడలేదు. అగ్నిమాపక శాఖ అధికారులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదు.