ప్రతి ఎన్నికల్లోనూ పార్టీ ఎన్నికల గుర్తు లాగానే స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించిన గుర్తులు కూడా ఉత్కంఠ రేపుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ గత ఎన్నికల్లో కొన్ని గుర్తులతో ఇబ్బంది పడింది. గత అసెంబ్లీ, ఉప ఎన్నికల్లో మాదిరిగానే బీఆర్ఎస్ పార్టీకి ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎన్నికల గుర్తులతో టెన్షన్ మొదలైంది. బీఆర్ఎస్ పార్టీ అధికార గుర్తు కారు అని తెలిసిందే. అయితే దీన్ని పోలిన గుర్తులు ఉన్నాయని బీఆర్ఎస్ భావిస్తోంది. రోడ్ రోలర్, రోటీ మేకర్ లాంటి గుర్తులు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని టెన్షన్ పెడుతున్నాయి. బీఆర్ఎస్‌కు పడాల్సిన ఓట్లు ఈ గుర్తలకు పడుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ ఆందోళనకు చెందుతోంది.