దిల్లీ : సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తూ పతంజలి క్షమాపణలు కోరింది. పతంజలి ఉత్పత్తులపై వచ్చిన వాణిజ్య ప్రకటనల కేసులో ఎండీ ఆచార్య బాలకృష్ణ సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. భవిష్యత్తులో తప్పుడు యాడ్స్ ఇవ్వకుండా తమ కంపెనీ జాగ్రత్తలు తీసుకుంటుందన్నారు. తప్పుడు ప్రచారాలు (యాడ్స్) ఇస్తున్నారని పతంజలి సంస్థకు రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ ఆషానుద్దిన్ అమనుల్లా ఈ కేసును వాదించారు. ఏప్రిల్ 2వ తేదీన కోర్టు ముందు హాజరుకావాలని బాలకృష్ణకు ఆదేశాలు జారీ చేశారు.