న్యూఢిల్లీ: కరోనాకు తొలి సాక్ష్యాధారిత మందును తీసుకొచ్చినట్లు పతంజలి వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం దీనికి సంబంధించిన శాస్త్రీయ పరిశోధన పత్రాన్ని యోగా గురు రాందేవ్ బాబా రిలీజ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్, రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా పాల్గొన్నారు.
గతేడాది జూన్‌లోనే పతంజలి.. కరోనిల్, శ్వాసరి పేరుతో కరోనాకు మందును తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
ఈ ఆయుర్వేద మందు కొవిడ్‌పై వంద శాతం ప్రభావవంతంగా పని చేసినట్లు క్లినికల్ ట్రయల్స్‌లో రుజువైందని పతంజలి సంస్థ చైర్‌పర్సన్ ఆచార్య బాలకృష్ణ వెల్లడించారు.
గిలోయ్, తులసి, అశ్వగంధ వంటి ఆయుర్వేద మూలికల నుంచి ఈ మందులు తయారు చేశారని, కరోనా పేషెంట్లపై ఇది సమర్థవంతంగా పని చేసినట్లు బాబా రాందేవ్ కూడా చెప్పారు.