– అందుబాటులో లేని గవర్నర్ తమిళిసై
– ఎల్లుండి కేబినేట్ విస్తరణ?
ఇదేనిజం, హైదరాబాద్: పట్నం మహేందర్ రెడ్డిని రాష్ట్ర కేబినెట్ లోకి తీసుకోబోతున్న విషయం తెలిసిందే. ఈటల రాజేందర్ స్థానాన్ని పట్నంతో భర్తీ చేయించాలని కేసీఆర్ భావిస్తున్నారు. నిజానికి ఇవాళే ఆయనతో రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయించాల్సి ఉంది. అయితే తాను అందుబాటులో ఉండటం లేదని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ చెప్పడంతో పట్నం ప్రమాణం కాస్త వాయిదా పడింది. 24 వ తేదీ (గురువారం) ఆయన ప్రమాణ స్వీకారం ఉండే చాన్స్ ఉంది. పట్నం మహేందర్ రెడ్డితో పాటు కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ను కేబినెట్ లోకి తీసుకోబోతున్నారంటూ ప్రచారం సాగుతోంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డితో రాజీనామా చేయించి.. ఆ పదవి గోవర్దన్ కు ఇవ్వబోతున్నట్టు సమాచారం.