Patnam Mahender Reddy : సీఐపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ బూతు పురాణం!
Patnam Mahender Reddy : టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో ఆ పార్టీ భారీ ఎత్తున ప్లీనరీని నిర్వహిస్తున్న వేళ… ఆ పార్టీకి చెందిన కీలక నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి చెందిన ఓ ఆడియో క్లిప్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.
ఫోన్‌లోనే తాండూరు సీఐ రాజేందర్ రెడ్డిపై బూతు పురాణం అందుకున్న మహేందర్ రెడ్డి… సీఐవి అయినా కూడా నీ తాట తీస్తా బిడ్డా అంటూ బెదిరింపులకు దిగిన వైనం కలకలం రేపుతోంది.
ఇటీవలే తాండూరులోని ఓ ఆలయంలో జరిగిన కార్యక్రమంలో మహేందర్ రెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత రోహిత్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తనకంటే కూడా రోహిత్ రెడ్డికి అధిక ప్రాధాన్యం దక్కినట్టుగా అనుమానించిన మహేందర్ రెడ్డి… అందుకు కారణం తాండూరు టౌన్ సీఐగా ఉన్న రాజేందర్ రెడ్డేనని నమ్మారు.
ఈ క్రమంలో నేరుగా రాజేందర్ రెడ్డికే ఫోన్ చేసిన మహేందర్ రెడ్ది ఆయనపై బూతు పర్వ అందుకున్నారు.
మంచిగా మాట్లాడాలంటూ సీఐ ఎంతగా వేడుకున్నా కూడా వినని మహేందర్ రెడ్డి పోలీసు అధికారిపై విరుచుకుపడ్డారు.