Homeహైదరాబాద్latest Newsపత్తిపాక రిజర్వాయర్ పలు ప్రాజెక్టుల నిర్మాణంల పై మంత్రులకు విన్నపం చేసిన ప్రభుత్వ విప్. అడ్లూరి...

పత్తిపాక రిజర్వాయర్ పలు ప్రాజెక్టుల నిర్మాణంల పై మంత్రులకు విన్నపం చేసిన ప్రభుత్వ విప్. అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ఇదే నిజం, ధర్మపురి టౌన్ : జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని పత్తిపాక రిజర్వాయర్‌ నిర్మాణం మరియు నియోజకవర్గలో ఇతర ప్రాజెక్టుల ఆధునీకరణ అదే విధంగా ఇతర అభివృద్ధి పనులు గురించి మంగళవారం రోజున రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ని,ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి ని,ఐటి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ,ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ,ఎమ్మెల్యే విజయ రమణ రావు ,ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తో హైదరాబాద్ లో మర్యాద పూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు..

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ … జగిత్యాల జిల్లాలోని 12,479 ఎకరాల ఆయకట్టుకు నీరందించే పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపట్టాలని,అదే విధంగా 230 ఎకరాల ఆయకట్టుకు శాశ్వత నీటి వనరులు అందించే గొల్లపెల్లి మండలంలోని రంగదాముని పల్లె రిజర్వాయర్ ఆధునికీకరణ మరియు 18 వందల ఎకరాల ఆయకట్టుకు శాశ్వత నీటి వనరులు అందించే వెల్గటూర్ మండలంలోని జంగనాల ప్రాజెక్ట్ ఆధునికరణ,అదే విధంగా నియోజక వర్గంలో ఉన్న గోదావరి నది ఎత్తిపోతల పథకాల నిర్వహణను ప్రభుత్వం చేపట్టాలని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి ని కలిసి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగిందనీ మంత్రి వెంటనే స్పందించి,అట్టి ప్రాజెక్ట్లకు సంబందించిన నివేదికలను అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగిందని,అదే విధంగా నియోజక వర్గంలో ఇతర అభివృద్ధి పనుల గురించి కూడా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ని కూడ కలిసి వారికి విన్నవించడం జరిగిందనీ వారు కూడా అట్టి వినతుల పై సానుకూలంగా స్పందించారని ఈ సందర్భంగా తెలిపారు.

Recent

- Advertisment -spot_img