హైదరాబాద్ః పవన్ కళ్యాణ్ పుట్టిన రోజుని పురస్కరించుకొని చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని శాంతిపురం మండలం ఏడవమైలు గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. గ్రామంలో 25 అడుగుల ఎత్తున బ్యానర్ కట్టే ప్రయత్నం చేస్తుండగా.. విద్యుత్ వైర్లు తగలడంతో 10 మంది విద్యుదాఘాతానికి గురి కాగా, ముగ్గురు కూడా అక్కడికక్కడే చనిపోయారు. మృతులను సోమశేఖర్, అరుణాచలం, రాజేంద్రగా గుర్తించారు. ఈ ఘటన తెలుసుకున్న పవన్ కళ్యాణ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ వారి కుటుంబాలకు రెండు లక్షల ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు. అలాగే చరణ్ , చిరంజీవి మిగత మెగా హీరోలు కూడా దీనిపట్ల స్పందించారు. కాగా మృతుల కుటుంబాలకు తన వంతుగా రామ్ చరణ్ ఒక్కో కుటుంబానికి రూ. 2.5 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించి తన గొప్ప మనసు చాటుకున్నారు. అలాగే వకీల్ సాబ్ చిత్ర నిర్మాతలు సైతం ఒక్కో కుటుంబానికి రెండు లక్షల సాయాన్ని ప్రకటించిన విషయం తెలిసందే.