Homeఆంద్రప్రదేశ్​ధర్మ దీక్ష చేసిన ప‌వ‌న్‌

ధర్మ దీక్ష చేసిన ప‌వ‌న్‌

అమరావతి: ఏపీలో హిందూ దేవాలయాలపై జరుగుతున్నవ‌రుస‌ దాడులకు నిర‌స‌న‌గా జనసేన అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ధ‌ర్మ దీక్ష చేశారు. ఏపీలో సనాతన ధర్మాన్ని పరిరక్షించుకొనేందుకు సెప్టెంబ‌ర్ 11న‌ సాయంత్రం 5.30 గంటలకు దీపాలు వెలిగించి ‘ధర్మాన్ని పరిరక్షిద్దాం – మత సమరస్యాన్ని కాపాడుకుందాం’ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తన వ్యవసాయ క్షేత్రంలో దీపాన్ని వెలిగించి ‘ధర్మాన్ని పరిరక్షిద్దాం – మత సమరస్యాన్ని కాపాడుకుందాం’ అని సంకల్పం చెప్పుకొంటూ పవన్ ధ్యానం చేశాడు. ధర్మాన్ని రక్షించుకొనే దిశగా అందరూ అడుగులు వేయాలని ఆయ‌న‌ ఆకాంక్షించారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img