Homeసినిమామల్టీస్టారర్​తో రానున్న పవన్​

మల్టీస్టారర్​తో రానున్న పవన్​

పవర్​స్టార్​ పవన్​ కళ్యాన్​, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​ల క్రేజీ కాంబినేషన్​ అంటే అభిమానులకు పండగే​. అయతే త్వరలోనే మరోసారి ఈ కాంబినేషన్​కు అంతా సిద్దమైనట్లు తెలుస్తుంది. అయితే ఈ సారి త్రివిక్రం సొంత కథ కాకుండా మలయాళ సూపర్ హిట్ అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రాన్ని తెలుగులో రిమేక్​ చేయాలని ప్లాన్​ చేస్తున్నారట. ఈ రీమేక్​లో నటించడానికి పవన్ కూడా ఆసక్తిగా ఉన్నారు. అయితే దీంట్లో చిన్న సమస్య కూడా ఉంది. ఈ రీమేక్​లో నటించడానికి ఇప్పటికే రానా, రవితేజ ప్లాన్​ చేశారట. ఇద్దరు హీరోలకు అవకాశం ఉండే ఈ చిత్రంలో ఇద్దరు వ్యక్తుల గొడవతో ఒక ఊరు ఎంత ఇబ్బంది పడిందన్నదే ఈ కథ మేయిన్​ లీడ్​ అని తెలుస్తుంది. మలయాళంలో బిజుమీనన్, పృథ్విరాజ్ నటించిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. అయితే పవన్​ గట్టిగా ప్రయత్నిస్తే రవితేజ లేదా రాణాలు పవన్​తో ఉన్న స్నేహం వల్ల డ్రాప్​ అయ్యే అవకాశం ఉంది. ఏ ఒక్కరు డ్రాప్​ అయినా పవన్​కు ఈ సినిమా మల్టీస్టారర్​ హిట్​గా నిలిచే అవకాశముంది.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img