Homeఫ్లాష్ ఫ్లాష్pawan kalyan: పాపారావు పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రశంశల జల్లు.. మరో ఐదు...

pawan kalyan: పాపారావు పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రశంశల జల్లు.. మరో ఐదు కార్లు రిజిస్ట్రేషన్

Pavan kalyan :జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రవాణా శాఖ కేంద్ర కార్యాలయం లో తలక్కున మెరిసాడు. గురువారం హైదరాబాద్ సోమాజిగూడ లోని రవాణా శాఖ కార్యాలయానికి వచ్చి డిప్యూటీ transport కమి షనర్ కే. పాపారావు ను కలిశారు. కొత్తగా కొన్న ఐదు కార్ల ను రిజిస్ట్రేషన్ చేయించుకోవడంతో పాటు పాపారావు కు కృతజ్ఞతలు చెప్పేందుకు స్వయంగా pawan kalyan రవాణా శాఖ కార్యాలయానికి వచ్చినట్లు సమాచారం. జనసేన పార్టీ ప్రచార రథం వారాహీ విషయం వివాదం చేసి . ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడి అధికారంలో ఉన్న వైఎ స్సార్సీపీ నాయకత్వం పవన్ ను ఇబ్బంది పెట్టింది. అన్ని నిబంధన ల ప్రకారం ఉండటంతో డిప్యూటీ కమి షనర్ గా ఉన్న పాపారావు చొరవ తీసుకుని వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించారు. మీడియా నుంచి విమర్శలు వచ్చినా.. నిబంధనల ను ఎక్కడా ఉల్లంఘించలేదని , నిబంధనలు పాటించామని, వాహనం రవాణా చట్టాలకు లోబడి ఉన్నదని పవన్ ప్రచార రథ వివాదానికి పాపారావు ఫుల్ స్టాప్ పెట్టాడు. దీనికి కృతఙ్ఞతగా పవన్ కళ్యాణ్.. పాపారావు ఛాంబర్ కి ప్రత్యేకంగా వచ్చి కృతజ్ఞతలు చెప్పినట్లు తెలిసింది. ఒక్క స్టేట్మెంట్ తో వివాదం లేకుండా చేసిన పాపారావు పై పవన్ ప్రశంశల వర్షం కురిపించినట్లు సమాచారం.

Recent

- Advertisment -spot_img