కాకినాడ పోర్టులో ఇటీవల 640 టన్నుల బియ్యాన్ని పట్టుకున్న ప్రాంతానికి నౌకలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై స్థానిక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, పోర్టు అధికారులపై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. కాకినాడ పోర్ట్ వద్ద సముద్రంలో ప్రయాణించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రేషన్ బియ్యం పట్టుబడ్డ నౌక వద్దకు ప్రత్యేక బోట్‌లో వెళ్లారు.. నౌకలో ఉన్న 38 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఎవరు సరఫరా చేశారని ఆరాతీసారు. సముద్రంలో 9 నాటికల్ మైళ్ల దూరంలో పట్టుబడ్డ 640 టన్నుల బియ్యం వద్దకు స్వయంగా వెళ్లి పవన్ కళ్యాణ్ కళ్యాణ్ పరిశీలించారు. భారీగా బియ్యం అక్రమ రవాణా అవుతుంటే ఏం చేస్తున్నారని
టీడీపీ ఎమ్మెల్యేపై పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు.