Pawan Kalyan : మంగళగిరిలోని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయంపై డ్రోన్ ఎగరడం కలకలం రేపింది. ఘటనపై వెంటనే డీజీపీ, గుంటూరు జిల్లా కలెక్టర్, ఎస్పీకి డిప్యూటీ సీఎం కార్యాలయ సిబ్బంది సమాచారం అందించింది. డ్రోన్ దాదాపు 20 నిమిషాల పాటు ప్రయాణించినట్లు గుర్తించారు. పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు.