ఏపీలో అభిమానులతో పాటు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన పవన్ కల్యాణ్‌కు శాఖల కేటాయింపు అంశంలో స్పష్టత వచ్చింది. కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌కు మంత్రి పదవి కేటాయించారు. ఏకంగా డిప్యుటీ సీఎం హోదా ఇచ్చారు. దీంతో పాటు మరిన్ని విభాగాలను ఆయన పర్యవేక్షించనున్నారు. పవన్ కల్యాణ్‌కు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ, తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు. పవన్ కల్యాణ్ హోదా తగ్గించకుండా డిప్యుటీ సీఎం పదవి కేవలం ఆయనకు మాత్రమే ఇచ్చారు.