నాగబాబుకు ఎమ్మెల్సీ ఇస్తున్నం అని జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఎమ్మెల్సీగా ఎంపికైన తర్వాతే నాగబాబుకు మంత్రి పదవి ఇవాళా లేదా అని ఆలోచిస్తాం అని తెలిపారు. నాగబాబు నాతో పాటు సమానంగా పనిచేశాడు. నేను ఇక్కడ కులం, బంధుప్రీతి చూడడం లేదు అని అన్నారు. ఎవరికి ఎంత ప్రతిభ ఉందో గుర్తించి వారికే పదవులు ఇస్తాం అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.