పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్నారు. ఎన్నికలకు ముందు పవన్ మూడు సినిమాలకు కమిట్ అయ్యాడు. సుజిత్ ‘ఓజీ’, ‘ఉస్తాద్ గబ్బర్ సింగ్’, ‘హరిహర్ వీర్ మల్లు’ సినిమాలను పవన్ ఇంకా పూర్తి చేయలేదు. తాజాగా పవన్ హరిహర వీరమల్లు షూటింగ్ లో పాల్గొన్నాడు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరి చూపు ‘ఓజీ’ పైనే.. .ఎందుకంటే ‘ఓజీ’లో అకీరా కూడా నటిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ ద్వారా తన కుమారుడిని చిత్ర పరిశ్రమకు పరిచయం చేసేందుకు భర్జరి భారీ సన్నాహాలు చేశారు. ఇందులో అకీరా కీలక పాత్రలో నటిస్తున్నాడని, ఇప్పటికే అకీరా పాత్ర షూటింగ్ పూర్తయిందని అంటున్నారు. తాజాగా రేణు దేశాయ్ కూడా తన కుమారుడి డెబ్యూ ప్రాజెక్ట్ పై స్పందించింది. కొడుకు ఎప్పుడు కావాలంటే అప్పుడు సినిమాల్లోకి రావచ్చునని అన్నారు.