పార్టీ పెట్టిన పదేళ్ల తర్వాత పోటీ చేసిన స్థానాల్లో విజయం సాధించి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్ అటు టీడీపీ, ఇటు బీజేపీ అధిష్టానం పెద్దల విశ్వాసాన్ని చూరగొన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ ఐదేళ్లలో తన మార్కు పాలన చూయించాలన్న భావనతో ప్రత్యేకంగా అనేక కార్యక్రమాలకు నడుం బిగించి సక్సెస్ అయ్యే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు మన జనసేనాని పవన్ కళ్యాణ్. ఇది చూసి నెటిజన్లు.. వారెవ్వా.. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారుగా అంటూ ప్రశంసింస్తున్నారు.