ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవికి పవన్ కళ్యాణ్ పై మాజీ ఎంపీ హర్షకుమార్ కీలక వ్యాఖలు చేసారు. మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. భారత రాజ్యాంగాన్ని కాదని, .మనుధర్మ శాస్త్రాన్ని తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. 100 రోజుల పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు సంకీర్ణ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని హర్షకుమార్ ఆరోపించారు. డిప్యూటీ సీఎం అయి ఉండి మత ప్రచారకుల వేషం వేసి ప్రజలను రెచ్చగొట్టడం పెద్ద నేరం. అలాంటి వాటిని పవన్ జాగ్రత్తగా సరిదిద్దాలని హర్షకుమార్ కోరారు.