ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో అల్లు అర్జున విడుదలైన తర్వాత.. పలువురు సినీ ప్రముఖులు ఆయనను పరామర్శించారు. ఇప్పటివరకు మౌనంగా ఉన్న పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ అరెస్ట్ పై తాజాగా స్పందించారు. కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును పరామర్శించేందుకు పవన్ కల్యాణ్ వెళ్లారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ వివాదంపై ఓ విలేకరి ఓ ప్రశ్న అడిగారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఇది సంబంధం లేని ప్రశ్న.. మనుషులు చనిపోతే సినిమాల గురించి ఏం మాట్లాడుతామని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇంతకన్నా పెద్ద సమస్యల గురించి ప్రస్తావించాలని పవన్ కళ్యాణ్ సూచించారు.