ఏపీ ప్రజలు, ప్రత్యేకంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికలు సజావుగా సాగేలా కృషి చేసిన అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ‘ ఓటింగ్ శాతం పెరిగేందుకు కృషి చేసిన మీడియా, పౌర సంఘాలకు థ్యాంక్స్. నాకోసం పనులు వదులుకొని వచ్చిన సినిమా నటులకు రుణపడి ఉంటా. నాకోసం సీటును వదులుకున్న పిఠాపురం తెదేపా ఇంఛార్జి ఎస్.వి.ఎస్. ఎన్. వర్మ, ఆయన అనుచరులకు కృతజ్ఞతలు. ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. రానున్న రోజుల్లో అందరన్నీ కలుపుకుంటూ పిఠాపురాన్ని ఒక మోడల్ గా చేస్తా’ అని బహిరంగ లేఖ ద్వారా తెలిపారు.