ఆంధ్రప్రదేశ్‌లో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జనసేన పార్టీ చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేసింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. అయితే గత ఆరు నెలలుగా ఉపముఖ్యమంత్రి రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. తాజాగా సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమాకి జ్యోతి కృష్ణ దర్సకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమాలోనిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ సెట్స్‌లో నుండి దిగిన సెల్ఫీని పవన్ కళ్యణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. బిజీ పొలిటికల్ షెడ్యూల్ తర్వాత, చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పని కోసం తన సమయాన్ని కొన్ని గంటలు కేటాయించానని పవన్ తెలిపారు.ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 28న థియేటర్లో విడుదల కానుంది.