సంధ్యా థియేటర్ ఘటన కేసులో నిన్న జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ను సినీ ప్రముఖులు కలిసి సంఘీభావం తెలిపారు. ఈ క్రమంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆదివారం బన్నీని కలుస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. పవన్ శనివారం రాత్రే గన్నవరం ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు చేరుకున్నారు. మరీ అల్లు అర్జున్ ఇంటికి వెళ్తారా? లేదా? అనే దానిపై ఇంకొద్ది సేపట్లో క్లారిటీ రానుంది.