Pawan Kalyan : తిరుపతి తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పారు. తప్పు జరిగింది.. మమల్ని క్షమించండి అని పవన్ కళ్యాణ్ అన్నారు. మీ వల్ల మేం తిట్లు తింటున్నాం అని పోలీసులు, టీటీడీ పై పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆగ్రహం వ్యక్తం చేసారు. బాధ్యతలను నిర్వర్తించడంలో ఈవో శ్యామలరావు, జేఈవో వెంకయ్య చౌదరి విఫలమయ్యారు అని అన్నారు. తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తుంది అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. టీటీడీ మొదటి ప్రాధాన్యత సామాన్య భక్తులే అని అన్నారు. దీనికి బాధులైన వారిని కఠినంగా శిక్షిస్తాం అని పవన్ అన్నారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటన ఆ గుడిలో కూడా జరగకూడదు.