ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటిసారిగా పవన్ కల్యాణ్ అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లారు. చిరంజీవి, రాంచరణ్, పూలమాలతో ఆహ్వానం పలికారు. చిరంజీవి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయ్. గజమాలతో సత్కరించి హత్తుకున్నారు. పవన్ కల్యాణ్ చిరంజీవి ఆశీర్వాదం తీసుకున్నారు. వారితోపాటు అకీరా, లెజినోవా, సురేఖ, నాగబాబు కూడా ఉన్నారు. కుటుంబసభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. చిరు ఇంటి ఆవరణలో అభిమానుల సందడి నెలకొంది.