చిక్కడపల్లి సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను పోలీసుల అరెస్ట్ చేసారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ కి రెండు వారాల రిమాండ్ నాంపల్లి కోర్టు విధించింది.ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కు మద్దతుగా మెగా కుటుంబ సభ్యులంతా ఆయన ఇంటికి కూడా వెళ్తున్నారు. ముందుగా మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత నాగబాబు కూడా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు వస్తున్నారు. పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించే అవకాశం ఉంది.