Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో ”ఓజీ”(OG) సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో గ్యాంగ్ స్టార్ పాత్రలో పవన్ కల్యాణ్ నటిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ అప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తుంది. తాజాగా ఈ సినిమా నుండి అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో AI టెక్నాలజీని డైరెక్టర్ సుజిత్ వడబోతున్నారు అని సమాచారం.ఈ సినిమాలో ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసం పవన్ కళ్యాణ్ 30 ఏళ్ల వయసున్న పాత్రలో చూపించనున్నారు. ప్రస్తుతం పవన్ వయస్సు 50 ఏళ్లు.. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ”ఖుషి” మూవీ సమయంలో ఎలా ఉన్నాడో ఆలా వెండితెరపై మరోసారి చూపించాలి అని సుజిత్ ప్రయత్నిస్తాడు. దానికి సంబంధించిన పనులను ఇప్పటీకే సుజిత్ మొదలు పెట్టాడు అని సమాచారం. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ”తమ్ముడు”, ”ఖుషి” సినిమాలు లాంటి లుక్స్ ను మరోసారి తెరపైన కనిపిస్తే పవన్ ఫ్యాన్స్ కి పండుగే. మరోవైపు ఈ సినిమాలో పవన్ షూటింగ్ 14 రోజులు బాలన్స్ ఉంది.. పవన్ డేట్స్ ఇస్తే సుజిత్ ఈ సినిమాని వెంటనే పూర్తి చేయాలి అని చూస్తున్నాడు. ఈ సినిమా 2025లో విడుదల కానుంది.